- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
PMAY: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇల్లు కట్టుకునేందుకు రూ.4 లక్షలు మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.2.50 లక్షలు అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1.50 లక్షలు ఇవ్వనుంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎంఏవై 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పథకానికి తమ వాటా నిధులను కేటాయించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఎన్నికల ముందే అన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసింది. ఈ క్రమంలో పీఎంఏవై పథకం కింద 2024-25 కాలంలో దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. కాగా, పథకానికి అర్హులయ్యే వారు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.30 వేలు నగదు అందనుంది.