- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: టీడీపీకి గవర్నర్ పదవి ఆఫర్ చేసిన బీజేపీ.. సీఎం చంద్రబాబు పరిశీలనలో ఆ ఇద్దరి పేర్లు!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల్ల టీడీపీ, బీజేపీ, జేనసేన కూటమి అదరగొట్టింది. ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన మంత్రాంగం పని చేసింది. కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కదన రంగంలోకి దిగిన ఆ మూడు పార్టీలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. జనంలోకి వెళ్లాయి. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా కూటమి 164 సీట్లు కైవసం చేసుకుని అధికారం చేజిక్కించుకుంది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకన్న అన్ని సీట్లు రాకపోవడంతో ఆ పార్టీ ఎన్డీఏ మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందులో టీడీపీ ఇచ్చిన మద్దతు చాలా విలువైంది కావడంతో.. అందుకు ప్రతిగా బీజేపీ ఓ గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రతిపాదన చంద్రబాబుకు చేరవేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్లు, మంత్రులు పని చేసిన వారిని గవర్నర్ పోస్టుకు రికమెండ్ చేసే అవకాశం ఉంది. అందులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.