పెద్ద చేపలు చిక్కలేదు.. చోటా మోటా నేతలకు కండువా కప్పిన సీఎం జగన్

by Mahesh |   ( Updated:2024-04-21 09:20:24.0  )
పెద్ద చేపలు చిక్కలేదు.. చోటా మోటా నేతలకు కండువా కప్పిన సీఎం జగన్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖలో వైసీపీ నేతలకు పెద్ద చేపలు చిక్క లేదు. ఎన్నికల సమయంలో పెద్ద నేతలను పార్టీ మార్చి జగన్ దగ్గర మొప్పు పొందడంతో పాటు ఎన్నికలపై ప్రభావం చూపుదామనుకొన్న వారి ప్రయత్నాలు ఫలించలేదు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేత కండువా తప్పించుకునేందుకు చోటా మోటా నేతలే దొరికారు.

వారు అంతంతమాత్రం నేతలే..

ఇప్పటికే పలు పర్యాయాలు పార్టీలు మారిన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలేనికి చెందిన నేత రుత్తుల ఎర్ర పాత్రుడు, అనకాపల్లికి చెందిన యువ నేత అడారి కిషోర్ కుమార్ లు శనివారం ముఖ్యమంత్రి చేత కండువాలు కప్పించుకొని పార్టీలో చేరారు. ఎర్రా పాత్రుడు 2009 లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఏ పార్టీ టికెట్ దక్కలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసిన కిషోర్ కుమార్ నారా లోకేష్ యువగళం కోసం పనిచేసినప్పటికీ తనకు టికెట్ ఇవ్వలేదంటూ వైసీపీలో చేరారు. ఆదివారం విశాఖలో జనసేన మత్స్యకార విభాగం ప్రధాన కార్యదర్శి మూగి శ్రీనివాస్ తదితరులు చేరనున్నారు. తనకు జనసేన నుంచి విశాఖ దక్షిణ సీటు ఇవ్వకపోవడంతో పాటు అసమర్థుడైన వంశీకి ఇచ్చారనే ఆవేదనతో ఆయన పార్టీ మారారు.

Read More..

కాపులకు పవన్ కల్యాణ్ కీలక పిలుపు

Advertisement

Next Story

Most Viewed