బిగ్ బ్రేకింగ్ : కుప్పంలో హై టెన్షన్.. చంద్రబాబు ప్రచార రథం అడ్డగింత..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-04 10:13:09.0  )
బిగ్ బ్రేకింగ్ : కుప్పంలో హై టెన్షన్.. చంద్రబాబు ప్రచార రథం అడ్డగింత..!
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతిపురం మండలం పెద్దూరు, శివకురుబూరు గ్రామాల్లో చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ ప్రచారం రథం, సౌండ్ బాక్స్‌లు ఉన్న వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కొత్త జీవో ప్రకారం చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.

రోడ్డుకు అడ్డంగా పోలీసులు బారికేడ్లను పెట్టారు. బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేశారు. ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో శాంతిపురంలో పోలీసులను భారీగా మోహరించారు. పర్యటనను ఎలా అడ్డుకుంటారని టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కొంత మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story