BIG BREAKING : మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

by Shiva |
BIG BREAKING : మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. జీవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవలే జీవో నం.2ను విడుదల చేసింది. దీంతో ఆమె న్యాయ పోరాటానికి దిగారు, ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. 2016లో తన కులాన్ని ఎస్టీగా కలెక్టర్‌ నిర్ధరించారని కొత్తపల్లి గీత తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం బుట్టదాఖలు చేసింది.

Advertisement

Next Story