- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్
దిశ,వెబ్‌డెస్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాన్(Fengal Typhoon) గడిచిన 6 గంటల్లో 10Kmph వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100కి.మీ, చెన్నైకి 100కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ సాయంత్రానికి కారైకాల్-మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను ప్రభావం తెలంగాణ పై కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో తెలంగాణ(Telangana)లో పూర్తిగా మేఘాల వాతావరణం ఉంటుంది. అయితే తెలంగాణలో చాలా తక్కువ ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రమే కురిసే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ(శనివారం) ఏపీలో రోజంతా రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయి. అలాగే.. ఉత్తరాంధ్రలో సాయంత్రం వేళ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది. తాజా అంచనాల ప్రకారం.. ఫెంగల్ తుఫాను నేడు తీరం దాటే అవకాశం కనిపించట్లేదు. ఇది రేపు(డిసెంబర్ 1న) ఉదయం వేళ తీరం దాటేలా ఉంది. అయితే తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పింది. రైతులు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.