- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijayawada:బిగ్ అలర్ట్..విజయవాడకు పొంచి ఉన్న మరో ముప్పు..?
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడలో వరద నీరు బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇప్పటికే విజయవాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెజవాడను మరోసారి వరద ఆందోళనకు గురిచేస్తోంది. విజయవాడ (Vijayawada) ముంపునకు కారణమైన బుడమేరు (Budameru) వాగుకు మళ్లీ వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరుకు నిన్న(మంగళవారం) వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం ఉండగా ఇవాళ 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వాగుకు 3 చోట్ల గండ్లు పడగా ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే ప్రక్రియను మంత్రి లోకేష్ (Nara Lokesh) మంత్రి నిమ్మల రామనాయుడు(Minister Nimmala)కు అప్పగించారు. వరద ఎక్కువగా ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతోంది.