జగన్ అక్రమాస్తుల కేసు: భారతీ సిమెంట్స్‌కు షాక్

by srinivas |
జగన్ అక్రమాస్తుల కేసు: భారతీ సిమెంట్స్‌కు షాక్
X

దిశ, ఏపీ బ్యూరో: భారతీ సిమెంట్స్‌కు సర్వోన్నత న్యాయ స్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీలపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్ డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఈడీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ (ఈడీ) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇరు వాదనలు విన్న జస్టిస్ అభయ్, ఎస్.ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ వాదనలతో ఏకీభవించింది. భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు పొంది ఎఫ్‌డీలను విడుదల చేయాలని గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు సూచించింది.

ఎఫ్‌డీలకు బదులుగా బ్యాంకు గ్యారంటీలను తీసుకున్న తర్వాత కూడా ఈడీ ఎఫ్‌డీలు జప్తు చేసిందని భారతీ సిమెంట్స్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఎఫ్ డీలను జప్తు చేసినా, కనీసం దానిపైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేయగా ఆ అదనపు పిటిషన్‌ను కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్‌డీలనే విడుదల చేయాలన్న తీర్పునే పున:పరిశీలించాలనప్పుడు..జప్తు చేసిన వాటికి వడ్డీ ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించిన జస్టిస్ అభయ్, ఎస్.ఓఖా ధర్మాసనం అభ్యంతరాలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేస్తూ ఆదేశాచ్చింది.

Advertisement

Next Story

Most Viewed