Bhuma Akhilapriya భర్తకు హైకోర్టులో ఊరట

by Javid Pasha |   ( Updated:2023-06-08 11:28:22.0  )
Bhuma Akhilapriya భర్తకు హైకోర్టులో ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న భార్గవ్ రామ్‌కు ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలకు చేరుకుంది. నంద్యాలలో నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ వర్గాలు వేర్వేరుగా ఏర్పాట్లు చేశాయి. అయితే లోకేశ్ పాదయాత్ర కొత్తపల్లి వద్దకు చేరుకోగానే ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో ఏవీ సుబ్బారెడ్డి గాయపడ్డారు. అంతేకాదు సుబ్బారెడ్డి చొక్కా సైతం చిరిగిపోయింది.

దీంతో గాయాలపాలైన సుబ్బారెడ్డిని పోలీసులు కారులో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఏవీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరుసటి రోజు మాజీమంత్రి భూమా అఖిల ప్రియతోపాటు ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే భూమా అఖిలప్రియ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా భార్గవ్ రామ్‌కు సైతం బెయిల్ మంజూరు అయ్యింది.భార్గవ్‌ రామ్‌ తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డిలు వాదనలు వినిపించారు.ఇరువాదనలు విన్న హైకోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.

See More...

భూమా అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్

Advertisement

Next Story