Bhagavanth Kesari : దుర్గమ్మ సేవలో భగవంత్ కేసరి మూవీ టీం

by Seetharam |   ( Updated:2023-10-30 08:01:30.0  )
Bhagavanth Kesari : దుర్గమ్మ సేవలో భగవంత్ కేసరి మూవీ టీం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం సోమవారం దర్శించుకుంది. భగవంత్ కేసరి మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలతోపాటు చిత్రంలోని నటీనటులు, ప్రొడ్యూసర్స్ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దగ్గర ఉండి పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. భగవంత్ కేసరి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సినిమా బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా విజయవంతం అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story