AP News:ఆ నాలుగు జిల్లాల పై మాజీ సీఎం జగన్ ఫోకస్ ..ఎందుకంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-06-22 11:24:38.0  )
AP CM Jagan Disburse Interest free loan to 3.95 Lakh Vendors Under Jagananna Thodu Scheme
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూసింది. దీంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో ఊహించని పరాజయంతో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. కీలక పదవుల్లో మార్పులు చేస్తున్నారు. పులివెందుల కేంద్రంగా అపరేషన్ వైసీపీ ప్రారంభించారు. ముఖ్యనేతలతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి నేతలను ఆహ్వానించారట. జిల్లాల వారీగా కడప నుంచే సమీక్ష మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story