- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బారికేడ్లు.. పోలీసులపై సీఎం చంద్రబాబు సీరియస్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో తొలిసారి మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 12న సీఎంగా ప్రమాణం చేసిన బాబు నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత విజయవాడలోని దుర్గామాత వద్దకు వెళ్ళాడు.అలాగే తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయింపు తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలో టీడీపీ ఆఫీసుకు వచ్చారు. అయితే సీఎం రాకతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇది గమనించిన సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయంలో బారికేడ్లు ఏంటి..? కార్యకర్తలను కలిసినప్పుడు ఇలాంటివి పెట్టొద్దు, నాకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు. ప్రజలు తమ వద్దకు వారి సమస్యలను తెలపడానికి వస్తారు. వారి వినతుల స్వీకరణ కోసం ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తాం. నిర్దిష్ట సమయంలో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని, తనను కలవడానికి వచ్చిన ప్రజలను పోలీసులు ఇబ్బంది పెట్టవద్దని సీఎం చంద్రబాబు పోలీసులకు చెప్పుకొచ్చారు.