బాలయ్య ఎమ్మెల్యేగా ప్రమాణం..నారా బ్రాహ్మణి ఎమోషనల్ పోస్ట్!

by Jakkula Mamatha |   ( Updated:2024-06-21 15:27:46.0  )
బాలయ్య ఎమ్మెల్యేగా ప్రమాణం..నారా బ్రాహ్మణి ఎమోషనల్ పోస్ట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 174 ఎమ్మెల్యేలతో నేడు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా నేడు(శుక్రవారం) ఏపీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో బాలయ్య ఎమ్మెల్యేగా మూడోసారి ప్రమాణం చేశారు. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా ఆయన కుమారై నారా బ్రాహ్మణి (X) ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘నాన్నా..నువ్వెప్పుడూ ప్రజల హీరోవి. నిరంతరం ప్రజల గుండెల్లోనే ఉంటావు. వారిని సంతోషంగా ఉంచేందుకు శ్రమిస్తారు. ఆల్ ది బెస్ట్ నాన్నా’ అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉద్విగ్న భరిత క్షణాలను మాకు సొంతం చేసిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ గారికి శుభాకాంక్షలు అని ఆనందం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఒక స్వర్ణ శకం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలకు ఇక అంతా మంచే జరుగుతుందని, ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణం చేసిన శుభ సందర్భంగా మావయ్య గారికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story