మీసం మెలేసిన బాలయ్య : స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్

by Seetharam |   ( Updated:2023-09-21 06:15:15.0  )
మీసం మెలేసిన బాలయ్య : స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్ ఇచ్చారు. శాసన సభలో మీసాలు తిప్పడం వంటి వికృత చేష్టలు చేయోద్దని సూచించారు. ఇది తొలి తప్పుగా భావిస్తూ నందమూరి బాలకృష్ణను వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడంతోపాటు మీసం మెలేయడాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. ఈ చర్యలు సరికాదని అన్నారు. మరోసారి ఇలాంటి చర్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా నియమాలను పాటించాలని తమ్మినేని సీతారం సూచించారు. స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అవహేళన చేస్తున్నారని ఇది సరికాదు అని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదని అంబటి చెప్పుకొచ్చారు. దమ్ముంటే రా అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే బాలకృష్ణకు ఛాలెంజ్ చేశారు. మరోవైపు బాలకృష్ణను చూస్తూ శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు.

Read More..

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్!

Advertisement

Next Story