- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలకృష్ణకు అసలే మెంటల్.. కాల్చినా కేసులుండవ్ : వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజైన శుక్రవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజిల్స్ ఊదడంపై వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజు మీసాలు మెలేయడం మరుసటి రోజు విజిల్స్ ఊదడం బాలయ్యకే చెల్లిందన్నారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ ప్రవర్తనపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని...ఆయనను ఆస్పత్రికి తరలిస్తే మంచిదని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమా డైలాగులను మధుసూదన్ రెడ్డి సభలో వినిపించారు. ఫ్లూటు జింక ముందు ఊదు..మీ బావ చంద్రబాబు ముందు ఫ్లూట్ ఊదుకోవాలి..సింహం లాంటి సీఎం వైఎస్ జగన్ రెడ్డి ముందు ఊదకండి అంటూ మధుసూదన్ రెడ్డి సూచించారు. చంద్రబాబు సైకో..ఆయన తమ్ముడికి మెంటల్ ఉందని, బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి బాలకృష్ణ సభలో కాల్పులు జరిపే అవకాశం ఉందని.. ఆయనను బయటకు పంపించాలని సూచించారు. అంతేకాదు టీడీపీ సభ్యులను మానసిక ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.