ఏపీలో ఎమర్జెన్సీ పాలన: జగన్ సర్కార్‌పై బాలకృష్ణ విమర్శలు

by Satheesh |   ( Updated:2023-01-14 15:05:22.0  )
Balakrishna Tests Corona Positive for Second time
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని.. ఒక సామాన్య ఓటరుగా, పౌరుడిగా, ఎమ్మెల్యేగా ఈ విషయం చెబుతున్నానని అన్నారు. అంతేకాకుండా తన తాజా చిత్రం వీరసింహారెడ్డి సినిమాలో కొన్ని డైలాగ్‌లు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉన్నాయన్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగ్‌లు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో కావో జనానికి తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరసింహారెడ్డి చిత్రం భారీ విజయం సాధించిందని.. పండుగ వేళ కుటుంబ సమేతంగా చూసే ఓ మంచి ఫ్యామీలి సినిమాను ప్రేక్షకులకు అందించామని తెలిపారు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి నారావారిపల్లికి రావడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Next Story