అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-21 06:14:39.0  )
అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. మీసాలు సినిమాలో తిప్పు.. ఇక్కడ కాదని అంబటి అన్నారు. దమ్ముంటే రా అంటూ అంబటి బాలకృష్ణకు సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు. ఇక, సభ్యుల ఆందోళన మధ్య ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది.

Read More..

చంద్రబాబు అరెస్ట్.. ఏపీ అసెంబ్లీలో హైటెన్షన్!

Advertisement

Next Story