ఏపీలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన బాలకృష్ణ

by Satheesh |   ( Updated:2024-06-22 12:16:57.0  )
ఏపీలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్.. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన బాలకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. క్యాన్సర్ మహ్మమారి ప్రజలను పట్టి పీడిస్తోందని అన్నారు. ఇక, ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరామని తెలిపారు. అడిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని అన్నారు. దాతల సహయంతో బసవతారకం ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందన్నారు. భవిష్యత్‌లో బసవతారకం ఆస్పత్రి సేవలు మరింత విస్తరించాలని అన్నారు. కాగా, క్యాన్సర్ చికిత్స కోసం ప్రస్తుతం ఏపీ వాసులు హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. త్వరలోనే ఏపీలో కూడా ఆసుపత్రిని నిర్మిస్తే ఇకపై వారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed