Viveka Case: హైదరాబాద్ రాలేను..సీబీఐకు ఎంపీ అవినాశ్ లేఖ

by srinivas |
Viveka Case:  హైదరాబాద్ రాలేను..సీబీఐకు ఎంపీ అవినాశ్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సోమవారం సీబీఐ విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ముందుగా కార్యక్రమాలు పెట్టుకున్నందున మరోసారి విచారణకు వస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సోమవారం హైదరాబాద్‌లో విచారణ జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డి సోమవారం జరిగే విచారణకు తాను హాజరుకాలేనని సీబీఐకు లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సీబీఐ అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అటు అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. మరి ఆయన కూడా విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.

Advertisement

Next Story