- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాదనలు షురూ.. ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుపై వాడివేడి వాదనలు
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ ఈనెల 27కు వాయిదా వేశారు. ఎన్ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్ తమ వాదనలు వినిపించారు. కోడికత్తి కేసు విచారణ కోర్టులో వాయిదాలు జరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు అవసరం లేదని వాదించారు. ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా నిందితుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని వెల్లడించారు. అంతేకాకుండా రెస్టారెంట్ యజమానికి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు వివరించారు. ఇరువాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ ఆంజనేయమూర్తి తదుపరి విచారణను మరోసారి వాయిదా వేశారు.
ప్రస్తుతం పదోన్నతిపై వేరే కోర్టుకు బదిలీ అయినట్లు వెల్లడించారు. కొత్త న్యాయమూర్తి కేసు వివరాలను వింటారని తెలిపారు. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. ఇకపోతే ఈనెల 17న ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలలో ఎన్ఐఏ దర్యాప్తు తీరుపై అనేక సందేహాలను అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో తమ వాదనలు వినిపించేందుకు కొంత గడువు కావాలని ఎన్ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్ ఎన్ఐఏ కోర్టును కోరారు. దీంతో కోర్టు విచారణను ఈనెల 20కు వాయిదా వేయడంతో గురువారం ఎన్ఐఏ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
జగన్ తరఫు న్యాయవాది వాదనలు ఇవే
గతంలో ఈనెల 17న విచారణ జరిగింది. ఈనెల 20కు వాయిదా వేసింది. కోడికత్తి కేసులో ఫ్లెక్సీ ఆధారంగా నిందితుడు వైసీపీకి సానుభూతిపరుడు అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కుట్రకోణాన్ని వెలికి తీయడంలో విఫలమయ్యారంటూ ఆరోపించారు. కోడికత్తిని రెస్టారెంట్‌లోకి ఎలా అనుమతించారు అనే దానిపై ఆరా తీశారు. సుమారు నాలుగు గంటలపాటు వాదనలు వినిపించారు. నేడు ఎన్ఐఏ తరఫున వాదనలు. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. సీఎం జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సోమవారం విచారణ సాగింది. సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదించారు.
కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు.నిందితుడు శ్రీనివాస్‌రావు జన్మభూమి కమిటీ సిఫార్సుతో ఠాణేలంక గ్రామంలో ఇంటి స్థలం తీసుకున్నాడని న్యాయవాది వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా నిందితుడు శ్రీనును పక్కా పథకం ప్రకారమే హర్షవర్థన్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లారని ఆరోపించారు. మరోవైపు నిందితుడు శీను తన గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీపై ఓ సినీనటుడు ముందుగా చెప్పిన గరుడ ఫొటో ఎందుకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు.ఈ అంశాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్ఐ కౌంటర్‌లో కీలక అంశాలు
కోడికత్తి కేసులో కుట్రకోణంలో విచారించాలంటూ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్ఐఏ కోర్టు కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని తెలిపింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటనకు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని వెల్లడించారు. కోడి కత్తి దాడి కేసుపై కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కౌంటర్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : High Court: ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దపై విచారణ వాయిదా