- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతి జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారం, హత్య
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన మర్చిపోకముందే మరో చోట ఘోరం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై బీహార్ యువకుడు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. బిస్కెట్లు ఇచ్చి బాలికను యువకుడు చెట్ల పొదల్లోకి తీసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రైస్ మిల్లులో పని చేసే కార్మికుడు కూతురి మృతదేహంగా గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గురువారం నిందితుడి జైల్లో ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.