Vizag: విశాఖలో దారుణం!.. పిల్లలను బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

by Ramesh Goud |
Vizag: విశాఖలో దారుణం!.. పిల్లలను బెదిరించబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అల్లరి చేస్తే చనిపోతానని పిల్లలను బెదిరించబోయి ప్రాణాలనే కోల్పోయిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన చందన్ కుమార్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా పని చేస్తున్నాడు. విధుల నిమిత్తం గత ఐదేళ్లుగా భార్య పిల్లలతో గోపాలపట్నం పరిధిలోని కొత్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. పిల్లల అల్లరి మాన్పించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. తన ఇద్దరు పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తూ.. జేబులో ఉన్న డబ్బు తీసి చింపేశారు. దీంతో చందన్ కుమార్ కోపంతో వారిని వారించే ప్రయత్నం చేశాడు. పిల్లలను కొట్టబోతుండగా భర్యా అడ్డుపడటంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది.

తనకు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని, ఇలా చేస్తే తాను ఆత్మహత్యా చేసుకుంటానని భార్య పిల్లలని బెదిరించాడు. అతని మాటలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఫ్యాన్ కు చీర కట్టి మెడకు చుట్టి బెదరించే ప్రయత్నం చేశాడు. చీర పొరపాటున మెడకు బిగుసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని భార్య కిందకు దించి అంబులెన్స్ కు ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చే లోపు చందన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రశాంతత కోసం పిల్లలను బెదిరించబోయి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story