- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నామినేషన్ల వేళ ట్విస్ట్.. నలుగురు టీడీపీ అభ్యర్థుల మార్పు..!
దిశ, వెబ్ డెస్క్: నామినేషన్ల వేళ తెలుగుదేశం పార్టీలో కీలక ట్విస్ట్ నెలకొంది. నలుగురు టీడీపీ అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉండి, మాడుగుల, మడకశిర, దెందులూరులో అభ్యర్థులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నలుగురు అభ్యర్థులు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు నామినేషన్లు వేస్తున్నారు. ఉండి అభ్యర్థిగా తొలుత రామరాజును ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ బీఫారమ్ ఇవ్వలేదు. రామరాజును మార్చి రఘురామకృష్ణంరాజుకు ఉండి నుంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మాడుగులలో మాజీ మంత్రి బండారును అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని సమాచారం. అనంతపురం జిల్లా మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమారుకు చంద్రబాబు సీటు కేటాయించారు. అయితే ఈ స్థానంలో ఎంఎస్ రాజును ప్రకటిస్తారని తెలుస్తోంది. అటు దెందులూరులోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. దెందులూరు నుంచి మాజీ మంత్రి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇప్పటివరకూ బీఫారమ్ ఇవ్వకపోవడంతో ఈ నియోజకవర్గంలోనూ మార్పులు జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 21న ఈ నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారమ్‌లు అందజేయనున్నారు. దీంతో తొలుత ప్రకటించిన నలుగురు టీడీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే వీరితో చంద్రబాబు మాట్లాడారని ఈ మేరకే కొత్త అభ్యర్థులను ప్రకటించనున్నారని టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు లీకులు ఇస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Read More...