17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఆ యాక్ట్ రద్దు..!

by srinivas |
17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఆ యాక్ట్ రద్దు..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా సీఎం చంద్రబాబు కసరత్తులు చేశారు. సమావేశాల షురూ కోసం తేదీని ఫిక్స్ చేశారు. దీంతో ఈ నెల 17 నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలి సమావేశాలు కానుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి రోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలపనున్నారు.

కాగా ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తాము అధికారంలో వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు.164 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేశారు. దీంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై సంతకం చేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ఆమోదంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ను ఈ నెల 17న రద్దు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed