- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:రెండ్రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు..వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారా!?
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో (19వ తేదీన) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్ర సృష్టించిన వైసీపీ ఈ సారి 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వైఎస్ జగన్ రాని పక్షంలో సమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం ఈ న్యూస్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Advertisement
Next Story