- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: విశాఖ ఉక్కు రక్షన సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీ వేదిక ఏర్పాటు
దిశ ప్రతినిధి, ఉక్కు నగరం: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడంపై గత కొంతకాలంగా అటు ప్రతిపక్షాలు, ఇటు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చెయ్యాలని కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయంపై పలుమార్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా తాజాగా మరోసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే కార్మికుల నినాదాలకు మద్దతుగా విశాఖ ఉక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విశాఖపట్నం ఉక్కు నగరం తృష్ణ మైదానంలో విశాఖ ఉక్కు న్యాయ సాధన సభకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. కాగా ఉక్కు నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించడం ఇదే తొలిసారి.
కాగా ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కూర్మ న్న పాలెం కూడలి మొదలు ఉక్కు ప్రధాన రహదారి లోని తెలుగు తల్లి విగ్రహం కూడలి నుండి సభ ప్రాంగణం వరకు రహదారి ఇరువైపుల ప్లెక్సీలను కట్టారు. సభకు విచ్చేసే వేలాదిమంది కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేశారు. కాగా ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల మొదటిసారిగా ఉక్కు నగరంలో జరిగే సభకు తొలిసారిగా వస్తుండడంతో ఈ సభకు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక అలాగైనా ఈ సభను విజయవంతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ ఉక్కు కర్మాగారం లో విధులు నిర్వహిస్తున్న ఉక్కు తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం బ్యానర్ లను సభా స్థలి ప్రాంగణం సమీపం లో కట్టారు . ఉక్కు కర్మాగారం లో తెలంగాణ కు చెందిన సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి జి. ఆనంద్ తెలిపారు.