ఎమ్మెల్యే vs మాజీ మంత్రి.. రణరంగంగా మారిన పుట్టపర్తి (వీడియో)

by Mahesh |   ( Updated:2024-06-02 08:43:41.0  )
ఎమ్మెల్యే vs మాజీ మంత్రి.. రణరంగంగా మారిన పుట్టపర్తి (వీడియో)
X

దిశ, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి సత్తెమ్మ గుడి వద్ద పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వర్గీయులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు పరస్పర ఒకరిపై ఒకరు చెప్పులు టెంకాయలు విసురుకున్నారు. కొద్ది రోజుల కిందట పల్లె రఘునాథ్ రెడ్డి పై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఆయన సవాల్‌ని స్వీకరిస్తూ పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులతో సత్యమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సత్యమ్మ గుడి లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. టీడీపీ నాయకుల, ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో వారు పుట్టపర్తి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

Advertisement

Next Story