APS RTC: ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. పండుగ సందర్భంగా 6,100 స్పెషల్ సర్వీసులు

by Shiva |
APS RTC: ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. పండుగ సందర్భంగా 6,100 స్పెషల్ సర్వీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయదశమి (Vijaya Dashami) సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ (APS RTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులను (Special Buses) నడపబోతున్నట్లుగా ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 20 వరకు మొత్తం 6,100 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

అందులో అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11కు విజయదశమికి ముందు 3,040 బస్సులు, అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు విజయదశమి తరువాత 3,060 స్పెషల్ బస్సులు ప్రయాణికులకు అందబాటులో ఉండునున్నాయి. పండగ నేపథ్యంలో ప్రయాణికులపై అదనపు భారం మోపకుండా కేవలం సాధారణ ఛార్జీలతోనే బస్సులను నడపనున్నట్లుగా అధికారులు తెలిపారు. అదేవిధంగా తిరుపతి, హైదరాబాద్, విజయవాడ మధ్య నడిచే ఏసీ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ చార్జీలపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ (APS RTC) నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed