- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ అల్లర్ల ఎఫెక్ట్.. మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ జరిగిన అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ దానికి బాధ్యులు అయిన అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం, పల్నాడు, తిరుపతి మూడు జిల్లాల పోలీస్ బాస్‌లపై ఈసీ వేటు వేసింది. తాజాగా ఈ మూడు జిల్లాలకు ఎన్నికల సంఘం ఎస్పీలను నియమించింది.
పల్నాడు ఎస్పీగా మల్లికాగార్గ్, తిరుపతి హర్షవర్దన్, అనంతపురం ఎస్పీగా గౌతమిశాలిని అపాయింట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడు జిల్లాలకు ఈసీ సూచించిన ముగ్గురిని ఎస్పీలుగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాడిపత్రి, పల్నాడు, అనంతరం, తిరుపతి, రెంటచింతల, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అల్లర్లు చోటు చేసుకున్నాయి.
Read More..
YS Sharmila: వివేకా హత్యపై సుప్రీం స్టే.. స్పందించిన వైఎస్ షర్మిల.. ఎమన్నారంటే..?