- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP TET-2024: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)-2024 పరీక్షకు సంబంధించి విద్యాశాఖ (Education Department) హాల్ టికెట్లను ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్ విధానం (Online procedure)లో పరీక్షలను నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అదేవిధంగా ఈనెల 19 నుంచి మాక్ టెస్టులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 4 తరువాత ప్రైమరీ 'కీ' (Primary Key)లను విడుదల చేసి అక్టోబర్ 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ ‘కీ’(Final Key)ని విడుదల చేసి నవంబర్ 2న తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.