ఆ పని చేస్తే అసెంబ్లీలోనే ఉరి తీయండి: అచ్చెన్ననాయుడు సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
AP TDP Chief Atchannaidu Allegations On YCP Government
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు స్పందించారు. మా పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే స్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజాలు దాడి చేశారని.. 75 ఏళ్ల వయసున్న ఎమ్మెల్యేపై అమానుషంగా దాడి చేశారని మండిపడ్డారు. మా ఎమ్మెల్యే పట్టుకున్న ప్లకార్డును స్పీకర్ తోసేశారని.. అంతేకాని స్పీకర్‌పై టీడీపీ సభ్యులు దాడి చేయాలేదని తెలిపారు. అలాగే సీటులో కుర్చున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో దాడికి సంబంధించిన వీడియోలను స్పీకర్ మినిట్ టూ మినిట్ వీడియో బయటకు తీయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విధంగా స్పీకర్‌పై టీడీపీ సభ్యులు దాడి చేసి ఉంటే మమ్మల్ని అసెంబ్లీలోనే ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story