అలర్ట్: AP పాలిసెట్ ఫలితాలు విడుదల

by Satheesh |   ( Updated:2023-05-20 06:52:09.0  )
అలర్ట్: AP పాలిసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. పాలిసెట్‌ పరీక్షలో 86.5 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం పరీక్షలో 1,24,021 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 15 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, మే 10వ తేదీన నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 1,43,625 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Advertisement

Next Story