AP News: రాజకీయ ముసుగులో కొందరు ఉన్మాదులు.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
AP News: రాజకీయ ముసుగులో కొందరు ఉన్మాదులు.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థ(Police Detp) నిర్విర్యం అయ్యిందని, లా అండ్ ఆర్డర్(Law And Order) తో పాటు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anita Vangalapudi) అన్నారు. అనంతపురం పీటీసీ(Ananthapuram PTC)లో 2023 బ్యాచ్ కు చెందిన 12 మంది డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్(DSP's POP) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అనిత.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవారు.. గంజాయి మత్తులో దోపిడీలు, అరచకాలు చేసే వారు మనకు ఛాలెంజ్ లు విసురుతున్నారని, వీటిన్నింటిపై మనం నిర్లిప్తతో ఉంటే జనంలో పోలీసులంటే భయం పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. పోలీస్ అంటేనే అందరూ భయపడినా కూడా నేను రక్షణగా ఉన్నాను అనే భరోసా ఉంటుందని, 500 మంది జనం మధ్యలో ఒక్క హోంగార్డును డ్రెస్ వేసుకొని ఉంటే అందరూ క్రమశిక్షణతో ఉంటారని, అది పోలీస్ డ్రెస్ కు ఉన్న ఘనత అని చెప్పారు.

ఈ సందర్భంగా పోలీస్ ఉద్యోగంలోకి పిల్లలను పంపించడం మహాపాపం అనే పేరును తుడిచేసి, రాష్ట్రానికి సేవ చేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని తయారు చేసినందుకు పోలీస్ కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పోలీసుల ఖ్యాతి(Police Pride)ని పెంచేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) అనునిత్యం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థ నిర్విర్యం అయిపోయిందని అన్నారు. కనీసం డిపార్ట్‌మెంట్ ఖర్చుల కోసం నిధులు(Funds) ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే కేంద్రప్రభుత్వం గ్రే హౌండ్స్ కి సంబందించి పూర్తిగా నిధులు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం ఈ నిధులను కేటాయించకపోవడం వల్ల ఈ రోజుకు కూడా గ్రేహౌండ్స్ పెండింగ్ లో పడిందని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను పటిష్టం చేయడంతో పాటు పోలీస్ వ్యవస్థ(Police Dept)ను, పోలీస్ వెల్ఫేర్(Police Welfare)ను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే సీఎం చంద్రబాబు స్వయంగా ఆ ప్రాంత ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని, దీన్ని బట్టి శాంతి భద్రతల విషయంలో సీఎం ఎంత నిబద్దతతో ఉన్నారో అర్థం అవుతుందని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు పోలీస్ వ్యవస్థకు 600 కోట్లు కేటాయించామని, మళ్లీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన టాస్క్(Task) ప్రభుత్వంపై పడిందన్నారు. సైబర్ క్రైం ఈ రోజుల్లో చాలా పెరిగిందని, స్కూల్ పిల్లలు సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాల భారీన పడుతున్నారని తెలిపారు. వీటిని అధిగమించడానికి ప్రతీ జిల్లాకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్(Cyber Crime Police Station) ఏర్పాటు చేయాలని చెప్పగానే సీఎం చంద్రబాబు ఓకే అని, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే రాజకీయ ముసుగులో కొందరు ఉన్మాదులు తప్పించుకుంటున్నారని, వారిని కంట్రోల్ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

Advertisement

Next Story