AP News: జగన్ ఇలాగే ఉంటే 175 మావే.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
AP News: జగన్ ఇలాగే ఉంటే 175 మావే.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్(Pulivendula MLA YS Jagan) కి ధైర్యం(Courage) ఉంటే అసెంబ్లీ(Assembly)కి రావాలని లేదంటే రాజీనామా(Resign) చేసి ఇంట్లో కూర్చోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. ఇటీవల జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం(Boycott of Assembly Meetings) పట్ల ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(APCC Chief YS Sharmila) స్పందిస్తూ.. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ఆయనతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని అన్నారు. దీనిపై ఇవాళ మీడియా ముఖంగా స్పంధించిన హోంమంత్రి.. మాజీ మంత్రి జగన్ పై విమర్శలు(Criticize) గుప్పించారు.

షర్మిలకు ఎంత విసుగు వచ్చి ఉంటే ఆ మాట మాట్లాడి ఉంటారో ఆలోచించాలని అన్నారు. అసెంబ్లీకి రాకుండా.. అధ్యక్ష అనకుండా ఎమ్మెల్యేగా ఉండి దేనికి అని ప్రశ్నించారు. పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా అసెంబ్లీకి రావాలంటే జగన్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆయన రాకపోవడమే గాక మిగతా ఎమ్మెల్యేలను కూడా రానివ్వడని చెప్పారు. ఇంకొన్ని రోజులైతే అసెంబ్లీకి వెళ్లని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి వేస్ట్ అని ప్రజలే అనుకుంటారని, ఇలాగే కొనసాగితే రేపటి రోజున 175 కి 175 సీట్లు ప్రజలు ఎన్డీఏ(NDA)కి ఇవ్వడంలో తప్పేమి లేదని అనిత వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed