సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి.. కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-25 10:11:15.0  )
సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్‌(CM Revanth Reddy) రెడ్డిని ఏపీ రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్(AP Minister Ramprasad Reddy) రెడ్డి నేడు(బుధవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన మంత్రి మండిపల్లి సీఎం రేవంత్‌ను శాలువా, బోకేతో సత్కరించారు. ఈ నేపథ్యంలో పలు విషయాల పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయనున్న ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) పై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి రాంప్రసాద్ రెడ్డి చర్చించి పలు అంశాలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత, సౌకర్యవంతమైన ఉచిత బస్సు ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులకు నూతన పాలసీ ద్వారా రాష్ట్రం లో మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని, నూతన కంపెనీ ద్వారా యువతకు మార్గదర్శకాలు అందిస్తున్నామనే పలు విషయాల పై చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed