పవన్ ‘బ్రో’ సినిమా అట్టర్ ప్లాఫ్.. మంత్రి అంబటి రాంబాబు

by Javid Pasha |   ( Updated:2023-08-01 12:31:52.0  )
పవన్ ‘బ్రో’ సినిమా అట్టర్ ప్లాఫ్.. మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా అట్టర్ ప్లాఫ్ అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బ్రో సినిమాలో తనను కించపరచడంపై మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ ను తీవ్రంగా విమర్శించారు. సినిమాలో తన శత్రువులను తిట్టడానికి పవన్ సీన్లు పెట్టించాడని అన్నారు. దీంతో ప్రేక్షకులు ఈ మూవీని ఆదరించలేదని అన్నారు. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కలిసి తనను కించపరచడానికి ఓ సీన్ క్రియేట్ చేశారని ఆరోపించారు. శ్యాంబాబు క్యారెక్టర్ ద్వారా తనను కించపరిచేందుకు ప్రయత్నించారని అన్నారు.

శ్యాంబాబు, రాంబాబు అని మాట్లాడితే రూ. కోటి కలెక్షన్ పెరగొచ్చేమో గానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యిందని అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ కి పవన్ కల్యాణ్ కు ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా రాలేదని అన్నారు. ఇక అమ్మవారి వాహనాన్ని కాళ్ల కిందపడేసి తొక్కుతున్నా పవన్ కల్యాణ్ సినిమాలు ఇక భవిష్యత్తులో ఆడబోవని అన్నారు. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ద్వారా చంద్రబాబు బ్రో సినిమాలో యాక్ట్ చేసినందుకు ప్యాకేజీ అందజేశారని ఆరోపించారు. తనను కించపరిచేందుకు పవన్ కల్యాణ్, బ్రో సినిమా నిర్మాతలు, నటులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: పవన్ ‘ఓజి’ ఫస్ట్ లుక్‌కు డేట్ ఫిక్స్

Advertisement

Next Story