AP: ఉదయమే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్న TDP నేతలు, అధికారులు

by Anjali |   ( Updated:2024-08-31 14:27:08.0  )
AP: ఉదయమే ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్న   TDP నేతలు, అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కూటమి సర్కారులో ఒకరోజు ముందే పింఛన్ల పండుగ ప్రారంభమైంది. ఇవాళ (ఆగస్టు 31)ఉదయమే ఇంటింటికి వెళ్లి అధికారులు, టీడీపీ నేతలు పింఛన్లు అందిస్తున్నారు. 65 లక్షల మంది లబ్దిదారులకు రూ. 2. 730 కోట్లు పంపిణీ అవ్వనున్నాయి. గతంలో వాలంటీర్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక పింఛన్లు అందిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీ గడువు పొడిగింపు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ఓ అధికారిని వర్షం పడుతుండగా పింఛన్లు ఇస్తున్నారుగా రేపు ఇవ్వచ్చుగా అని ప్రశ్నించగా.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వికలాంగులకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని వెల్లడించారు. అలాగే 1 వ తేదీన ఆదివారం వస్తుంది. ఆదివారం పనిచేయాలంటే అధికారులు ఇబ్బంది పడుతారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. అలా అయితే ముందు రోజు ఇవ్వండని అన్నారని తెలిపారు. కమిషనర్, టీడీపీ, జనసేన,బీజేపీ నాయకులు అందరూ కలిసి నేడు పింఛన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పింఛన్లు తీసుకునే వారి ఆనందానికి అవధులు లేవని చెప్పుకొచ్చారు. ఇక నేడు ఓర్వకల్లులో పెంఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed