AP KGBV Recruitment: కేజీబీవీల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

by Maddikunta Saikiran |
AP KGBV Recruitment: కేజీబీవీల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(AP)లోని క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యా(KGBV)ల్లో టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్‌(Recruitment) ద్వారా మొత్తం 604 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టీచర్(Teacher) పోస్టులు 507 ఉండగా, నాన్-టీచింగ్(Non-teaching) పోస్టులు 97 ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరానికి(2024-25) కాంట్రాక్ట్(Contract), ఔట్ సోర్సింగ్(Outsourcing) ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. అయితే ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియగా ఈ నెల 13 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అయితే ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ , ఎంపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Advertisement

Next Story

Most Viewed