AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు!

by Shiva |
AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరండంతో వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న నాడు చంద్రబాబుపై కొంతమంది నేతలు అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడారు. ఆయన సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వా్న్ని కించపరిచేలా రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తుండగా వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడటంతో సీన్ ఒక్కసారిగా మారింది. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి బాగొలేదని, ఆ విషయాన్ని వైద్యుడిగా తాను ధృవీకరిస్తానంటూ కామెంట్ చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌‌లో ఎమ్మెల్యే గౌతు శిరీష, టీడీపీ నేతలు.. మాజీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్పలరాజుపై కేసు నమోదు చేయనున్నారు.

Advertisement

Next Story