- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిస్సైన వారి ఫోటో, వివరాలు వాట్సాప్ చేయండి
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై హోంమంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర, బాధాకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఘటనాస్థలికి బృందాలు వెళ్లాయని చెప్పారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికుల వివరాలను అధికారుల బృందాలు సేకరిస్తున్నాయని.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ - 1070, 112, 18004250101. మీకు సంబంధించి మిస్సయిన వారి సమాచారం కోసం 8333905022 నెంబర్‌కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయాలని కోరారు. పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని వివరాలు తెలియజేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి: