High Court: జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించండి

by Gantepaka Srikanth |
7 Newly Appointed Judges for AP High Court are to be Taken Oath
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రత కుదింపు పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం.. జామర్ వెహికిల్స్ కూడా కేటాయిస్తామని హైకోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అంతకుముందు జగన్‌కు భద్రత ఇవ్వడం లేదని, అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పని చేయడం లేదని వైసీపీ అధినేత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జగన్‌కు సెక్యూరిటీని తగ్గించారని... జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని కోరారు. ప్రముఖులకు భద్రత విషయంలో రాజీపడవద్దని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Advertisement

Next Story