- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt.: ఉచిత ఇసుక పాలసీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జీవో విడుదల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పాలసీ-2024 (Sand Policy-2024)కు సంబంధించి సినరేజీ రుసుమును మాఫీ చేస్తూ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం భూగర్భ గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) జీవో(Government Order)ను విడుదల చేశారు. కాగా, ఉచిత ఇసుక పాలసీపై ఈనెల 21న జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting)లో ఎలాంటి రుసుము లేకుండా ఇసుకను సామాన్య ప్రజలు నిర్మాణ అవసరాలకు వాడుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సినరేజీ ఫీజు (Synergy Fee), మెరిట్ అన్ శాండ్ (Merit unsand), డీఎంఎఫ్ (DMF) మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవో (Government Order) పేర్కొన్నారు. గ్రామాల్లో అవసరాలకు సరిపడేంత ఇసుక రవాణాకు అనుమతించాలని సూచించారు. అంతకు ముందు కేవలం ఎడ్ల బండ్లలో మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుతించే వారు. సర్కార్ తాజాగా విడుదల చేసిన జీవో (Government Order)తో ట్రాక్టర్లలో కూడా ఇసుకను తీసుకెళ్లేందుకు సమాన్య ప్రజలకు అవకాశం లభించింది.