- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ జీవో ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆరోపిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, టీడీపీ నేతలు వర్ల రామయ్య, కొల్లు రవీంద్రలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. జీవో నెం.1ని కొట్టివేసింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందన్న హైకోర్టు అభిప్రాయపడింది. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని న్యాయవాది వాదించారు. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారన్న న్యాయవాది కోర్టులో వాదించారు.
Also Read.
ఆరేళ్ల చిన్నారిని రేపిస్ట్ నుండి కాపాడిన ర్యాపిడో డ్రైవర్ ఫస్ట్ రియాక్షన్ (వీడియో)
- Tags
- ap news