- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: చర్చలు సఫలం.. రేపటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు సఫలం అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమించాలని కార్మికులు నిర్ణయించారు. జీవో వచ్చాక పూర్తిగా సమ్మె విరమిస్తామని పేర్కొన్నారు. గురువారం నుంచి విధుల్లో చేరతామని మున్సిపల్ కార్మికులు తెలిపారు.
కాగా మున్సిపల్ కార్మికులు పలు డిమాండ్లతో సమ్మెకు దిగారు. దాదాపు 16 రోజులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. కానీ ఫలించలేదు. దీంతో మున్సిపల్ కార్మికులు సమ్మెను కొనసాగించారు. తాజాగా మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. డిమాండ్లపై హామీ ఇవ్వడంతో కార్మికులు మొత్తబడ్డారు. తాత్కాలికంగా సమ్మె విరమించేందుకు అంగీకరించారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు.
మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు స్పష్టం చేయడంతో అటు ఏపీ ప్రజలకు ఉపశమనం కలుగుతోంది. 16 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. పలు చోట్ల వీధుల్లో, కాలనీల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కోరుతున్నారు.