- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీబీటీ చెల్లింపులకు అనుమతివ్వండి.. ఈసీని కోరిన ఏపీ ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: డీబీటీ చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత పథకాలకు డీబీటీ పద్ధతులో చెల్లింపులు కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరింది. ఐదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలికే అనుమతివ్వాలని విజ్ఞప్తి చేసింది. టీడీపీ ఒత్తిళ్లతోనే ఇప్పటివరకూ అనుమతివ్వడంలేదని ఆరోపించింది. పెన్షన్ తరహాలోనే డీబీటీ చెల్లింపులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది.
కాగా ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా నగదు బదిలీ చేసింది. దీంతో లబ్ధిదారులకు భారీగా ప్రయోజనం చేకూరింది. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలకు డీబీటీ ద్వారా చెల్లింపులు చేసింది. 58 నెలల్లో వివిధ సంక్షేమ పథకాలను డీబీటీ స్కీమ్స్ ద్వారా నగదు చెల్లించడంతో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు అందాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, పింఛన్ దారులకు నగదు పంపిణీలో చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా ప్రభుత్వం డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలకు నగదు చెల్లించేలా అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరింది. మరి ఏం జరుగుతోందో చూడాలి.