TDP: ఏపీలో వరుసగా ఘెరాలు.. చంద్రబాబు తీవ్ర ఆవేదన... ప్రజలకు బహిరంగ లేఖ

by srinivas |
TDP: ఏపీలో వరుసగా ఘెరాలు.. చంద్రబాబు తీవ్ర ఆవేదన... ప్రజలకు బహిరంగ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్, బాపట్ల బాలుడి హత్యతో పాటు గంజాయి ఘటనల నేపథ్యంలో ప్రజలకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ తీరు, ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో నేరగాళ్లు పెరిగిపోతున్నారని మండిపడ్దారు. మహిళలకు భద్రత లేదని, ప్రజల ఆస్తులకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవంతో వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గంజాయి, గన్ కల్చర్ విచ్చలవిడి అయిపోయిందని తెలిపారు. చాలా చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారన్నారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారమే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందిందనటానికి నిదర్శమని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story