- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Twist: ‘ఇద్దరిలో భర్త ఎవరు..?’.. చెప్పాలని శాంతికి నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఉద్యోగంపైకి తెచ్చాయి. తాను విదేశాల్లో ఉండగా భార్య శాంతి గర్భం దాల్చిందని, మగ బిడ్డకు జన్మనిచ్చిందని, తండ్రి ఎవరో చెప్పాలని దేవాదాయ శాఖకు భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం ఇప్పుడు పలు మలుపులు తిరిగింది.
శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డినేనని మదన్ మోహన్ ఆరోపించారు. దీంతో శాంతి ప్రెస్ మీట్ పెట్టి తానూ మదన్ మోహన్ 2016లోనే విడాకులు తీసుకున్నానని తెలిపారు. ఆ తర్వాత న్యాయవాది సుభాష్ తనను పెళ్లి చేసుకున్నాడని, తమ ఇద్దరికి పుట్టిన బిడ్డ పుట్టారని చెప్పారు. ఇప్పుడు ఇలా చెప్పడం శాంతిని చిక్కుల్లో పడేసింది. 2020లో దేవదాయ శాఖలో శాంతి ఉద్యోగంలో చేరారు. అయితే ఉద్యోగంలో చేరే సమయంలో ఆమె సర్టిఫికెట్లలో భర్త పేరు మదన్ మోహన్ అని ఉంది. ఆమె సర్విస్ రిజిస్ట్రర్‌లోనూ అదే పేరు ఉన్నట్లు సమాచారం. గత ఏడాదిలో తనకు ఏడాది పాటు మెటర్నిటీ లీవ్ కావాలని దేవాదాయ శాఖను కోరింది.
అయితే ఆ దరఖాస్తులోనూ భర్త పేరు మదన్ మోహన్ అనే ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. విడాకులు తీసుకోకుండానే శాంతి మరో పెళ్లి చేసుకున్నారని, నిబంధనలను ఉల్లంఘించారంటూ దేవాదాఖ శాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మరో 6 అంశాలపై సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఇప్పటికే శాంతికి పుట్టిన బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పెళ్లి చేసుకోలేదని ఇప్పటికే లాయర్ సుభాష్ తెలిపారు. పలు అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఆమె సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ వివాదంతో చిక్కుకున్నారు. మరి శాంతి సమాధానం ఎలా ఉంటుందో చూడాలి.