- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం పవన్.. అమిత్ షాతో భేటీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) బుధవారం హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah)తో ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం విజయవాడ ఎయిర్పోర్టు(Vijayawada Airport) నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. రాష్ట్రానికి సంబంచిన పలు కీలక విషయాలను షాతో పవన్ చర్చించనున్నారు. అయితే ఏఏ అంశాలపై మాట్లాడతారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారనే సమాచారం మాత్రమే బయటకు వచ్చింది. పవన్ ఢిల్లీ పర్యటన అంశాలకు సంబంధించిన పూర్తి అప్‌డేట్ బుధవారం ఉదయం బయటకు తెలిసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. చూడాలి మరి.
కాగా పవన్ కల్యాణ్ మంగళవారం (ఈరోజు) పల్నాడు జిల్లాలో పర్యటించారు. వేమవరంలో సరస్వతి పవర్ భూముల(Saraswati Power Lands)ను పరిశీలించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) హయాంలో సరస్వతి పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారని, రైతులపిల్లలకు ఉద్యోగాలిస్తామని భూములు తీసుకున్నారని తెలిపారు. భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేశారని పవన్ వ్యాఖ్యానించారు. మరి ఇన్నేళ్లయినా రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 1,384 ఎకరాల్లో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని, దళితుల భూమి తీసుకున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీ రాలేదని అన్నాచెల్లెళ్లు కొట్టుకున్నారన్నారని తెలిపారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారని, వైఎస్ జగన్(YS Jagan) సీఎంగా ఉన్నప్పుడు 50 ఏళ్లకు లీజు తీసుకున్నారని, సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వరనే క్యాప్టివ్ పవర్‌గా అనుమతి తీసుకున్నారని పవన్ పేర్కొన్నారు.