ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by srinivas |   ( Updated:2024-08-22 04:10:32.0  )
ఆపద్బాంధవుడు అన్నయ్య.. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పవన్  ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆపద్బాంధవుడు అన్నయ్య అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో చిరంజీవి సహాయం చేశారని తనకు తెలుసని, అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

‘‘కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను.’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed