- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పుపై పవన్ స్పందన ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఒక వర్గం నిరంతరం పోరాటం చేసిందని తెలిపారు. దాని ఫలితమే సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మరీ పోరాటం చేశారని గుర్తు చేశారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఎన్డీయే-2 కాలంలో ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, అందరికీ సామాన హక్కులు కల్పించొచ్చని పవన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీకోర్టుకు కేంద్రప్రభుత్వం తెలిపిందని చెప్పారు. అయితే ఈ తీర్పుతో ఎస్సీల్లో ఐక్యత చెక్కు చెదరకుండా చూసుకోవాలని సూచించారు. ఆ బాధ్యతను ఎస్సీ వర్గం మేధావులు, విద్యావంతులపై ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/cdifes8NlZ
— JanaSena Party (@JanaSenaParty) August 1, 2024